Ganesh Shobha Yatra In Hyderabad : 11 రోజుల పాటు భక్తులతో పూజలందుకున్న గణనాథులను గంగమ్మ ఒడికి చేరుతున్నారు. దీంతో పోలీసులు పకడ్బంది ఏర్పాట్లు చేశారు. ఇవాళ హైదరాబాద్ నలుదిక్కుల నుంచి లక్షలాది మంది భక్తులు వేలాదిగా గణనాథుల ప్రతిమలను హుస్సేన్‌సాగర్‌కు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటుచేసుకోకుండా నిఘాను కట్టుదిట్టం చేశారు.
94 నిమజ్జన కేంద్రాల ఏర్పాటు: పాతబస్తీ మొదలు సాగర్ వరకు వైభవంగా గణేష్ శోభాయాత్ర సాగుతుంది. అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మెుత్తం 94 నిమజ్జన కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరిన్ని ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాటు చేశారు. ప్రధాన యాత్రపై ఒత్తిడిని తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
440 మంది విద్యార్థులకు శిక్షణ: నగరంలో 12 వేలకు పైగా మండపాలకు క్యూ ఆర్ కోడ్, జియో ట్యాగింగ్ చేశారు. దీనివల్ల ఏ గణనాథుడు యాత్రా ఏ మార్గంలో వెళ్తుందో… ఎక్కడున్నారో అనే విషయం పోలీసులు సులభంగా అంచనా వేసుకోనున్నారు. దీనికి సంబంధించి 440 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వీరు 7 షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తారు.
ట్రాఫిక్ మళ్లింపులు: చాంద్రాయణ్ గుట్ట, మూసారాంబాగ్, చాదర్ ఘాట్, చార్మినార్, ఫలక్‌నుమా, మదీనా చౌరస్తా, అఫ్జల్‌గంజ్, కోఠి, ఎంజే బ్రిడ్జ్, లిబర్టీ, ఖైరతాబాద్, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌తో పాటు ఇతర కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణపై చర్యలను చేపడుతుంది. నిమజ్జన పాయింట్ల వద్ద వీటిని పరిశీలించి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్‌కు సమాచారాన్ని అందజేస్తారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలి.
మెట్రో సేవలు: గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని మెట్రో నిర్వాహకులు తెలిపారు.
Ganesh Immersion: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. గణపతి గంగమ్మ ఒడికి చేరారు. ఈసారి 69 అడుగుల ఎత్తు ఉన్న వినాయకుడు 10 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్నారు. శనివారం ఉదయం పారంభమైన నిమజ్జనం ఊరేగింపు మధ్యాహ్నం వరకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. వినాయకుడి విగ్రహాన్ని క్రేన్ సహాయంతో నీటిలోకి దించారు. క్రేన్-4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది.


