కరీంనగర్ లో ఘనంగా హోలీ పండుగ వేడుకలు జరిగాయి. తెలంగాణ చౌక్ లో నిర్వహించిన హోలీ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని సందడి సృష్టించారు. హోలీ పండుగ వేళ కార్యకర్తలతో కలిసి డీజే పాటలకు స్టెప్పులు వేసి సందడి చేసిన మంత్రి గంగుల..తెలంగాణలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని, తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాలు ఆనందంగా జరుపుకునే పండుగ హోలీ అన్నారు.
విభేదాలను రాజకీయాలను పక్కనపెట్టి ఆడుకునే పండుగ ఈ రంగుల పండగ జరుపుకోవాలని,
నాడు కార్యకర్తగా నిన్న ఎమ్మెల్యేగా ఎలా ఉన్నానో ఇప్పుడు మంత్రిగా కూడా ఎలాంటి భేషజాలకు తావు లేకుండా అందరితో కలిసి హోలీ ఆడుతున్నాను అని తెలిపారు.
ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, హోలీ పండుగ వేళ రసాయనిక రంగులు కాకుండా సహజమైన రంగులనే వాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రు గంగుల.