Saturday, November 15, 2025
HomeతెలంగాణHoney Trap: హనీ ట్రాప్‌లో యోగా గురువు.. రూ. 56 లక్షలు కాజేసిన కి'లేడీ'లు

Honey Trap: హనీ ట్రాప్‌లో యోగా గురువు.. రూ. 56 లక్షలు కాజేసిన కి’లేడీ’లు

Yoga Teacher Honey Trap: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యోగా గురువు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. ఆయన నిర్వహిస్తున్న యోగాశ్రమంలో అనారోగ్యం పేరుతో చేరిన ఇద్దరు మహిళలు.. ఆయనకు సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి రూ. 56 లక్షలు వసూలు చేశారు. మరో రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. 

- Advertisement -

ఇటీవల కాలంలో కొంత మంది డబ్బులు ఈజీగా సంపాదించడానికి ఎంతకైన తెగిస్తున్నారు. కొంతమంది చోరీల బాటపడుతుండగా.. మరికొంత మంది హనీట్రాప్‌లకు పాల్పడుతున్నారు. అమ్మాయిల్లా గొంతులు మార్చుకుని ఫెక్ కాల్స్ చేస్తూ బాధితుల నుంచి డబ్బు దండుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అమ్మాయిలు సైతం ఈజీ మనీ కోసం హనీట్రాప్‌లకు పాల్పడుతున్నారు. మగాళ్లను బుట్టలో వేసుకుని ఆ తర్వాత చనువుగా ఉండి, అందిన కాడికి దోచుకుంటున్నారు. 

Also Read: https://teluguprabha.net/crime-news/husband-attacked-on-wife-demanding-extra-dowry-in-nagole/

హనీ ట్రాప్‌ ద్వారా యోగా గురువును వలలో వేసుకుని రూ. లక్షల్లో డబ్బు కాజేశారు ఇద్దరు మహిళలు. అనంతరం మరింత డబ్బు కావాలంటూ వారి గ్యాంగ్‌ లీడర్‌ డిమాండ్‌ చేయడంతో.. ఇక చేసేదేం లేక గోల్కొండ పోలీసులను బాధితుడు ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముఠా గుట్టు రట్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. 

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యోగా గురువును అమర్‌ గ్యాంగ్ పథకం ప్రకారం హనీ ట్రాప్ చేసింది. అనారోగ్యం పేరుతో ఇద్దరు మహిళలు.. చేవెళ్లలో ఆయన నిర్వహిస్తున్న యోగాశ్రమంలో చేరారు. అలా ఆ ఆశ్రమంలో ఆశ్రయం పొంది అదును చూసుకుని ఆ ఇద్దరూ యోగా గురువుతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి.. యోగా గురువును గ్యాంగ్‌ లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది.

Also Read: https://teluguprabha.net/telangana-news/union-minister-kishan-reddy-remembers-nizams-tyranny-at-photo-exhibition/

ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించడంతో ఆ గ్యాంగ్‌కు యోగా గురువు తొలుతగా రూ. 56 లక్షల చెక్కును అందించారు. అవి తీసుకున్నాక అనంతరం తమకు మరో రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ బాధితుడిని ఆ గ్యాంగ్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో యోగా గురువుకు వారి బెదిరింపులు అధికం కావడంతో సహనం కోల్పోయారు. చేసేదేం లేక గోల్కొండ పోలీసులను బాధితుడు ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయన ఫోన్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆ క్రమంలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

యోగా గురువు హనీ ట్రాప్‌లో చిక్కుకుని రూ. 56 లక్షలు ఇవ్వడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad