Sunday, July 7, 2024
HomeతెలంగాణThangallapalli: ప్రజా గొంతుక పొన్నంను విమర్శించడం మీ చేతకాని తనానికి నిదర్శనం

Thangallapalli: ప్రజా గొంతుక పొన్నంను విమర్శించడం మీ చేతకాని తనానికి నిదర్శనం

అబద్ధాల హామీల సంగతి కేటీఆర్ ను అడిగే దమ్ముందా మీకు?

ప్రజా గొంతుక పొన్నంను విమర్శించడం బిఆర్ఎస్ నేతల చేతకాని తనానికి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ జె టోనీ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ఒక బీసీ నాయకుడు, కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి దశ నుండి ఉద్యమాలే ఊపిరిగా ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన, చేస్తున్న బడుగు, బలహీన వర్గాల నాయకుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అని తెలిపారు. మొన్నటి రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలో పొన్నం కార్యకర్తలపై ఉన్న చనువుతో ప్రేమ, అభిమానాలు కురిపిస్తూ వేదికపై కార్యకర్తలను ఉద్దేశించి సూచనలు చేస్తూ, గత ప్రభుత్వ దోపిడీ, నిరంకుశ పాలన వల్ల మార్పు కోరుకున్న తెలంగాణ సమాజం నిరంకుశ పాలన నుండి ప్రజా పాలన వైపు అడుగులు వేయగా ప్రజా ప్రభుత్వం గురించి మంత్రి వివరిస్తున్నా క్రమంలో అది జీర్ణం చేసుకొని బిఆర్ఎస్ సన్నాసులు వక్రీకరించుకుంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ ను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. ముందు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అబద్ధాల హామీల సంగతి గురించి కేటీఆర్ ను అడిగే దమ్ముందా మీకు? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలో ఉండి హామీలు అమలు చేయలేని నాయకులు బిఆర్ఎస్ దద్దమ్మలని ఎద్దేవ చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని ఓర్వలేని కేటీ రామారావు బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ద్వారా ఈ విధంగా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్, కేటీఆర్ దోపిడీని, దొరతనాన్ని ప్రశ్నించే దమ్ము లేని సన్నాసులు మీరా పొన్నంపై విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేయడమని మండిపడ్డారు. కేటీఆర్ వల్ల సిరిసిల్ల ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో, ఈ ప్రాంతం ఎంత నిర్వీర్యమైందో ఈ ప్రపంచానికి తెలవద్దనే కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలియజేశారు. బిఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు ఆపకపోతే ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పక తప్పదంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News