మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీస్ పరీక్షను క్లియర్ చేయడం ఎలాపై సదస్సు.
మేడ్చల్‌లోని మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన “మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీస్ పరీక్షను క్లియర్ చేయడం ఎలా” అనే సదస్సు విద్యార్థులకు కీలకమైన మార్గదర్శకాన్ని అందించారు.
హైదరాబాద్ లోని 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ, జి5 మీడియా గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో అనేకమంది ముఖ్యవక్తలు తమ అనుభవాలు పంచుకున్నారు.
21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి. కృష్ణప్రదీప్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నిర్మాణంలో బ్యూరోక్రాట్లు కీలక పాత్ర పోషిస్తారని, ప్రధాని కూడా తన ప్రణాళికల అమలులో ఐఏఎస్ అధికారులపై ఆధారపడతారని చెప్పారు. సివిల్ సర్వీస్ పరీక్ష విజయానికి అసాధారణ ప్రతిభ అవసరం లేదని తెలియజేసిన ఆయన, “సాధారణ విద్యార్థులు కూడా సరైన కృషితో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు” అన్నారు.
అకాడమీ చీఫ్ మెంటార్ Dr. భవాని శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ, సమయాన్ని అనవసరంగా వ్యర్థం చేయకుండా సరిగ్గా వినియోగించుకోవాలని, యుపీఎస్సీ సిలబస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అభ్యర్థులకు సూచించారు.
మల్లా రెడ్డి కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామి రెడ్డి, యుపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష గురించి వివరిస్తూ, ఈ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 24 విభాగాల సేవలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రామస్వామి రెడ్డి , పి. కృష్ణప్రదీప్, డాక్టర్ భవాని శంకర్ , G5 మీడియా డైరెక్టర్ గిరి ప్రకాష్ అకాడమీ నిపుణులు రూపొందించిన ప్రత్యేక స్టడీ మెటీరియల్స్ ని విడుదల చేసి లైబ్రరీలో విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచారు.