ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మల్లాపూర్ మండల కేంద్రం లోని ఆదర్శ పాఠశాలకు వెళ్లేదారి అధిక వర్షాల వలన కొట్టుకపోయింది. ఇలా అకాల వర్షాలతో వరద నీటి ప్రవాహం వలన రోడ్డు కొట్టుకపోయి
విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడితే పాఠశాలకు వెళ్లే దారిలేక పాఠశాలకు సెలవు ఇస్తున్నారు. పాఠశాలకు వెళ్లే దారి ఇలా అకాల వర్షాలకు పాడైపోవడం, తాత్కాలిక మరమ్మత్తు చేపట్టిన వరద ప్రవాహానికి రోడ్డు కొట్టుకపోవడం కొత్త కాదని దీనిని పరిష్కరించే వారు కరువయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మేల్కొని ఆదర్శ పాఠశాలకు వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మించి రాకపోలకు అంతరాయం కలగకుండా చూడాలని కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే దీనిపై స్పందించి త్వరగా బ్రిడ్జి నిర్మించి విద్యార్థులకు అవాంతరాలు లేకుండా చూడాలని కోరుతున్నారు.
How to reach Model school? : ఆదర్శ పాఠశాలకు దారేది?
వరదలకు కొట్టుకు పోయిన రహదారి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES