హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన వేల్పుల దీప్తి తల్లిదండ్రులు గతంలో మరణించారు. ఈరోజు దీప్తి వివాహం సుందరగిరి వెంకటేశ్వర స్వామి గుడిలో జరుగుతున్న సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి నిరుపేద దళిత యువతికి నేనున్నానంటూ దీప్తి పెళ్లి ఖర్చుల నిమిత్తం 10,116 రూపాయలు అలాగే అమ్మాయికి అబ్బాయికి నూతన వస్త్రాలు స్థానిక నాయకుల ద్వారా అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఈ సందర్భంగా వేల్పుల దీప్తి-వారి బంధువర్గం ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.