Saturday, October 5, 2024
HomeతెలంగాణHusnabad: హుస్నాబాద్ గడ్డ మీద కేటీఆర్ సభ

Husnabad: హుస్నాబాద్ గడ్డ మీద కేటీఆర్ సభ

హుస్నాబాద్ పట్టణంలో 5వ తేదీన మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పురపాలక ,ఐటి శాఖ మాత్యులు కె. తారక రామారావు ఈ నెల 5వ తేది శుక్రవారం రోజున హుస్నాబాద్ కు పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు శంకుస్థాపనల కొరకు విచ్చేస్తున్న సందర్భంగా హెలిప్యాడ్ , సభ స్థలాన్ని సందర్శించారు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… హుస్నాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, కేటీఆర్ మొదటిసారి హుస్నాబాద్ కు వస్తున్న సందర్భంలో ప్రజలందరూ ఆ సభ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున స్వాగతం తెలపడానికి సిద్ధంగా ఉన్నారని 50 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -

ఈ నెల 5వ తేదీన కేటీఆర్ హుస్నాబాద్ లో ప్రారంభించే అభివృద్ధి పనుల వివరాలు: రూ.2 కోట్ల 25 లక్షలతో నిర్మించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రూ 2 కోట్లతో నిర్మించిన టీచర్ ట్రైనింగ్ సెంటర్, రూ.10 లక్షలతో నిర్మించిన బస్తీ దావఖాన, రూ 16కోట్ల 46 లక్షలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,రూ 1కోటి 20 లక్షలతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, రూ 1కోటి తో నిర్మించిన ఇండోర్ స్టేడియంను ప్రారంభిస్తారు.

రూ 3 కోట్ల 50 లక్షలతో ఎల్లమ్మ చెరువు సుందరికరుణ పనులను, 2 కోట్ల రూపాయలతో దోబీ ఘాట్, 2 కోట్ల 50 లక్షలతో హుస్నాబాద్ బిటి రోడ్డు హుస్నాబాద్ సబ్ స్టేషన్ నుండి మహమ్మదాపూర్ వరకు, హుస్నాబాద్ సబ్ స్టేషన్ నుండి కస్తూర్బా స్కూల్ వరకు పనులకు శంకుస్థాపన చేస్తారు. మొత్తం పనుల విలువ 33 కోట్ల 51 లక్షలు …అనంతరం హుస్నాబాద్ డిపో గ్రౌండ్లో జరిగే బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు. హుస్నాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. మంత్రి కేటీఆర్ సభకు భారీ జన సమీకరణ చేస్తున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News