హుస్నాబాద్ నియోజకవర్గ కల్లోల ప్రాంతంలో అభివృద్ధి విస్ఫోటనంగా మాతోనే ఉండాలని కరవు సీమపై ఆకుపచ్చని సంతకం చేసి హుస్నాబాద్ ను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారు ఎమ్మెల్యే సతీష్ కుమార్. హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకువెళ్తున్న ఆయనకున్న మంచి పేరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే మళ్ళీ విజయానికి సోపానాలుగా మారనున్నాయి. హుస్నాబాద్ ను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదినం సందర్భంగా శనివారం హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సతీష్ కుమారును కలిసి తెలుగు ప్రభ జాతీయ తెలుగు దినపత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనం మెమోంటో అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఇ రవీందర్, మిత్రులు.