Friday, October 18, 2024
HomeతెలంగాణHuzurabad: అమరుల త్యాగాల ఫలితంగానే స్వతంత్రం

Huzurabad: అమరుల త్యాగాల ఫలితంగానే స్వతంత్రం

అమరులను గుర్తు చేసుకోవాలి

విదేశీ పాలన కింద నలిగిన భారతీయులు కొన్ని సంవత్సరాల అలుపెరుగని ఉద్యమాలు, అమరుల త్యాగల ఫలితంగానే మనకు స్వాతంత్రం సిద్ధించిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వము నిర్వహిస్తున్న “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” ఉత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ అంబెడ్కర్ చౌరస్తా నుంచి జమ్మికుంట గాంధీ చౌరస్తా వరకు బైక్ ర్యాలీని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ..భగత్ సింగ్, రాజగురువ్ లాంటి భరతమాత బిడ్డలు దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబం ఎక్కారన్నారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “ఆజాది కా అమృత్ మహోత్సవ” కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము చేపట్టిందన్నారు. 75 వసంతాల స్వేచ్ఛను అనుభవించిన ఈ దేశం, ఆనాటి అమరత్వాన్ని అమరవీరుల త్యాగాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, పొందుతున్నటువంటి సౌభాగ్యం మన ముత్తాతలు, తాతలు త్యాగాల ఫలితమేనని గుర్తు చేశారు. ప్రజలకు ఆస్తులు, అంతస్తులు ఉండొచ్చు పోవచ్చు కానీ దేశం యొక్క గౌరవం స్వేచ్ఛ కాపాడుకోవాల్సిన కర్తవ్యం మనందరి మీద ఉందన్నారు. భారత మాత ముద్దుబిడ్డలుగా అమరులైన వారందరి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, నాయకులు సంపెల్లి సంపత్, శీలం శ్రీనివాస్, జీడి మల్లేష్, ఆకుల రాజేందర్, పొనగంటి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News