Friday, November 22, 2024
HomeతెలంగాణHuzurabad: అభివృద్ధి పనులు అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదు

Huzurabad: అభివృద్ధి పనులు అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదు

ఎమ్మెల్యే పాడి కౌశిక్

పార్లమెంటులో తెలంగాణ ప్రజల గొంతుకగా బోయినపల్లి వినోద్ కుమార్ ఉంటారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాల మైదానం ఆవరణలో మార్నింగ్ వాక్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వినోద్ కుమార్ తెలంగాణ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. గతంలో బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. ఉప్పల్ బ్రిడ్జి, బిజిగిరిషరీఫ్ బ్రిడ్జి తోపాటు ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. కరీంనగర్ కి రైల్వే ఏర్పాటులో కూడా కీలకపాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. అభివృద్ధిలో భాగంగా హుజురాబాద్ గ్రౌండ్ ను కూడా మినీ స్టేడియం చేయడం కోసం పది కోట్లు వెచ్చించారని, పనులు జరుగుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు నిలిపివేయడానికి ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయాల్సి ఉండగా వాటిని అభివృద్ధి చేస్తుండగా అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం చేసిన పనులు కొన్ని ఇప్పటికి మధ్యలోనే ఉన్నాయని వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేస్తే మరో ఉద్యమం మొదలుపెట్టక తప్పదని హెచ్చరించారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి నియోజకవర్గానికి తట్టెడు మన్నైనా పోశాడా అని ప్రశ్నించారు. కనీసం ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా హుజురాబాద్ నియోజకవర్గానికి రాలేదన్నారు. టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పురోగమనం వైపు అడుగులు వేస్తే కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పోతుందని అన్నారు. కరీంనగర్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

- Advertisement -

✳️ మరో అవకాశం ఇస్తే గతంలో కంటే కరీంనగర్ ని మరింత అభివృద్ధి చేస్తా…

కరీంనగర్, హుజురాబాద్ ట్విన్ సిటీ లుగా మారుస్తా…

ఎంపీగా గెలిపిస్తే కౌశిక్ రెడ్డి తో కలిసి హుజురాబాద్ అభివృద్ధిలో పాలుపంచుకుంటా…

బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్….
కరీంనగర్ ఎంపీగా తనకు మరోసారి అవకాశం ఇస్తే కరీంనగర్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని బిఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాల మైదానం ఆవరణలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల సమస్యలపై ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల సమస్యలపై పార్లమెంటులో మాట్లాడి తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగురవిస్తానని అన్నారు. గతంలో ఎంపీగా అవకాశం కల్పించినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చామని అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని అలాగే హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప్పల్ బ్రిడ్జితో పాటు బిజిగిరిషరీఫ్ బ్రిడ్జి కూడా పూర్తి చేశామన్నారు.

కరీంనగర్ రైల్వే మార్గానికి కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. కాజిపేట్ హసన్పర్తి హుజురాబాద్ మీదుగా కరీంనగర్ కు కలిపే రైల్వే మార్గాన్ని కూడా ఏర్పాటు చేయమని అప్పుడే చెప్పామని దాని మీద కేంద్ర ప్రభుత్వం సుముఖముగా లేకపోవడంతో ఆగిపోయిందని ఎంపీగా గెలిచిన అనంతరం తప్పకుండా హుజురాబాద్ కు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. హుజురాబాద్, జమ్మికుంటలను ట్విన్ సిటీగా మారుస్తానని అన్నారు. కేంద్రం నుంచి హుజురాబాద్ నియోజకవర్గానికి రావలసిన నిధులను తప్పక తీసుకువస్తానని, హుజురాబాద్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తో కలిసి పని చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని ప్రజలు గుర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, బీఆర్ఎస్ హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, గందె శ్రీనివాస్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News