Thursday, July 4, 2024
HomeతెలంగాణHuzurabad: అనుచరుడి పాడె మోసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Huzurabad: అనుచరుడి పాడె మోసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ఆర్థిక సాయం కూడా..

తన అనుచరుడు అకాల మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని హుటా హుటిన మృతుడి స్వగ్రామానికి వెళ్లి అంతిమయాత్రలో పాల్గొని మృతుడి పాడేమోసి, అనుచరుడిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్యామ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉండేవాడు. శ్యామ్ అకాల మృతి చెందడంతో మృతుని స్వగ్రామం లస్మక్కపల్లిలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మృతుడి పాడె మోశారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News