Sunday, July 7, 2024
HomeతెలంగాణHuzurabad: కౌశిక్ రెడ్డిని కలిసిన గ్రామీణ వైద్యులు

Huzurabad: కౌశిక్ రెడ్డిని కలిసిన గ్రామీణ వైద్యులు

కౌశిక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం

శ్రీ విఘ్నేశ్వర ఆర్ఎంపి పి.ఎం.పి అసోసియేషన్ హుజురాబాద్ మండల ఆర్ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కందగట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల సదానందం, కన్నబోయిన తిరుపతి, ప్రధాన కార్యదర్శి చిలకమారి శ్రీనివాస్, కోశాధికారి కమల్ సింగ్, హుజురాబాద్ డివిజన్ జనరల్ సెక్రెటరీ కొక్కుల రవీందర్, రామరాజు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News