Sunday, September 1, 2024
HomeతెలంగాణHuzurabad: రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి

Huzurabad: రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి

చరిత్రలో నిలిచిపోనున్న 31 వేల కోట్ల రుణమాఫీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని, సోషల్ మీడియాలో వచ్చే వాదంతులను నమ్మవద్దని, రాష్ట్ర చరిత్రలో రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయడం చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు.

- Advertisement -

హుజురాబాద్ కెసి క్యాంపులోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ను వీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కాంగ్రెస్ కార్యకర్తలతో బైక్ ర్యాలీ లో రైతు వెంక రెడ్డిని బైక్ పై కూర్చోబెట్టుకొని ప్రణవ్ రైతు వేదికకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ వివిధ జిల్లాల నుండి రైతులతో ముఖాముఖిని టీవీ మానిటర్ ద్వారా వీక్షించారు.

ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారమే ఏకకాలంలో రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని, రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు రైతులకు అందించి వారికి మరింత తోడ్పాటును ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు తప్పక అమలు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి వారి కళ్ళల్లో ఆనందం చూసామని, అవి మా పార్టీకి శ్రీరామరక్షగా ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News