కార్మికుల పక్షాన పోరాడుతుంది ఐ.ఎన్.టి.యు.సి అని ఆ సంఘం నేత జనక్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఐఎన్టీయుసి జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ నాయకత్వములో ఎక్జిక్యూటివ్ బాడీ సమావేశం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఐఎన్టియుసి జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల కార్మికుల జెబిసీసిఐ బోర్డులో ఐఎన్టియుసి లేకుండా బీజేపీ చేసిన కుట్రలకు దీటుగా హైకోర్ట్ లో కేసు వేసి జెబిసిసిఐలో ఐఎన్టియుసి పాల్గొనే విధంగా కృషి చేసి తనకు శాశ్వత వేజ్ బోర్డు మెంబర్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపారు. వేజ్ బోర్డులో ఐఎన్టియుసి చొరవతోనే 25 శాతం అల్లోవెన్స్ ల మీద పెంపు సాధించామని అన్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల గురించి మరియు రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపుదల వంటి విషయాలు ఐఎన్టియుసి తరపున మాట్లాడినట్లు పేర్కొన్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రస్తుతం నిర్వహించలేని పరిస్థితిలో యాజమాన్యం ఉంటే చట్టబద్దమైన ఐదు జాతీయ సంఘాలను, టిబిజికేఎస్ సంఘాలను సంప్రదించే నేగోశేషన్ ప్రకారం గనులు, డిపార్టుమెంటులు, జిఎం ,మరియు కార్పొరేట్ స్థాయి లలో జరిగే చర్చలకు కార్మిక ప్రతినిధులను ఆహ్వానించి పలప్రదమైన సూచనలు, సలహాలను స్వీకరించి కంపెనీ మనుగడ పురోగ అభివృద్ధి కై మరియు కార్మికుల సంక్షేమం హక్కుల పరిరక్షణకు మెరుగైన పారిశ్రామిక సంబంధాలను మెరుగు పరుచుకొనాలని ఐఎన్టియుసి ప్రతినిదుల సమావేశంలో చర్చించరన్నారు. కేవలం ఒక ఐఎన్టియుసి మాత్రమే కార్మికుల పక్షాన పోరాడుతుందని, ఐఎన్టియుసి పటిష్టమైన నాయకులు కార్యకర్తలు ఉన్నారని అన్నారు.
- అనంతరం ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జీ సంజీవ రెడ్డిని సన్మానించి రామగుండంలో జరిగే ఐఎన్టియుసి జాతీయ మహాసభలకు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఉన్న ఐఎన్టియుసి ముఖ్య నాయకులు పాల్గొన్నట్లు తెలిపారు.