Sunday, April 13, 2025
HomeతెలంగాణHyd: కళ్లు తిరిగి పడిపోయిన ఆందోళనకారుడు, భుజాన ఎత్తుకున్న సీఐ

Hyd: కళ్లు తిరిగి పడిపోయిన ఆందోళనకారుడు, భుజాన ఎత్తుకున్న సీఐ

టీఎస్ పీఎస్సీ పేపరు లీకేజీల వ్యవహారం రోజురోజుకూ వేడెక్కుతోంది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏబీవీపీ విద్యార్థి సంఘం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. సంఘం కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రగతి భవన్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. ఓ విద్యార్థి ఆకస్మాత్తుగా సొమ్మసిల్లిపడిపోయాడు. అక్కడే బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రారెడ్డి అది గమనించి వెంటనే విద్యార్థిని తన భుజాలపై ఎత్తుకున్నారు. అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు. చికిత్స నిమిత్తం ఆటోలో కూర్చోబెట్టి ఆసుపత్రికి తరలించారు. ఇది గమనించి పలువురు ఆయన తీసుకున్న చొరవను ప్రశంసించారు. సీఐ హరిశ్చంద్రారెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారని అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News