Friday, October 18, 2024
HomeతెలంగాణHyd: బండి సంజయ్ దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టిన మహిళలు

Hyd: బండి సంజయ్ దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టిన మహిళలు

కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు చింతల్ ఐడిపిఎల్ చౌరస్తాలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో బండి సంజయ్ దిష్టి బొమ్మను మహిళలు చెప్పులతో కొట్టి.. బీజేపీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేసి.. దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం సంజయ్‌ వ్యాఖ్యలపై చర్యలు తీసుకొని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో మహిళలు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

బండి సంజయ్ ఫుట్ పాత్ నాయకుడని వివేక్ అన్నారు. బిజేపికి రాష్ట్రంలో రోజు రోజుకీ ఆదరణ తగ్గడం తట్టుకోలేక బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే బండి సంజయ్ కి ఉన్న పని అన్నారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామన్నారు. హద్దు మీరి మాట్లాడే ముందు బండి సంజయ్ ఇంట్లో మహిళలు ఉన్న విషయం మర్చిపోవద్దన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News