Saturday, November 23, 2024
HomeతెలంగాణHyd: భగీరథ జయంతి పోస్టర్ ఆవిష్కరించిన శ్రీనివాస్ గౌడ్

Hyd: భగీరథ జయంతి పోస్టర్ ఆవిష్కరించిన శ్రీనివాస్ గౌడ్

సర్వ జీవకోటికి ప్రాణాధారమైన పవిత్ర గంగను దివి నుండి భువికి తీసుకువచ్చిన అపర భగీరథుని జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా జరుపనుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న భగీరథ మహర్షి జయంతి వేడుకల సందర్భంగా రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర పంచాయతీరాజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తో కలిసి ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మహనీయుల జయంతులను ఘనంగా జరిపిన చరిత్ర కేవలం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కుల వృత్తుల మీద ఆధారపడ్డ జాతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి బీసీలు రుణపడి ఉంటారన్నారు. భవిష్యత్తులో బీసీ వర్గాలను మరింతగా ఎదిగించేందుకు అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం చేయూతని అందిస్తుందని స్పష్టం చేశారు.

తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో జరిగిన ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరి కిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, జాతీయ నాయకులు వెంకట్రావు సగర, ఉదయ్ సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రవి సగర, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కృష్ణ సగర, గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం అధ్యక్షులు సీతారాం సగర, సంఘం నాయకులు ఆంజనేయులు సగర, రమేష్ సగర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News