మొబైల్ ఫోన్ల రంగంలో దిగ్గజ సంస్థ శాంసంగ్ కు చెందిన గెలాక్సీ AI సిరీస్ మొబైల్స్ సూపర్ సేల్ తమ సంస్థ షోరూమ్ లలో జూన్ 14 తేదీ నుంచి ప్రారంభమవుతుందని తెలుగు రాష్ట్రాలలో నెంబర్ వన్ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ ఫౌండర్ సీఎం డి శ్రీ బాలు చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా అత్యంత పేరు ప్రఖ్యాతులు పొందిన మొబైల్ తయారీ కంపెనీ సాంసంగ్ అత్యాధునిక గెలాక్సీ AI సిరీస్ మొబైల్ ఫోన్ల సూపర్ సేల్ తెలుగు రాష్ట్రాలలోని తమ షోరూములన్నింట్లోనూ ఈనెల 14వ తేదీ నుంచి విక్రయించనున్నట్లు తెలిపారు.
అధునాతన ఫీచర్లు..
అత్యంత అధునాతనమైన ఫీచర్లతో కూడిన ఈ AI సిరీస్ మొబైల్స్ ప్రారంభపు ధర రూ.39,999 గా ఉందని ఆయన తెలిపారు. అత్యంత అధునాతనమైన ఈ శాంసంగ్ గెలాక్సీ AI సిరీస్ స్మార్ట్ ఫోన్లు అద్భుతమైన సాంకేతికతకు ప్రతిరూపాలని ఆయన పేర్కొన్నారు. చూడచక్కని ఆకర్షణీయమైన రంగులతో, డిజైన్లతో రూపొందించబడిన ఈ గెలాక్సీ AI సిరీస్ స్మార్ట్ ఫోన్లు కస్టమర్లకు అద్భుతమైన సాంకేతికతనే కాక చక్కని అనుభూతులను కూడా అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
AI సిరీస్ ప్రత్యేక ఫీచర్లు:
సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్నేట్ చాట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, 50MP అడాప్టివ్ పిక్సెల్ టెక్నాలజీ తో కూడిన కెమెరా, నైటోగ్రఫీ, AI ఎడిట్ కెమెరా, గేమింగ్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3, బిగ్గర్ వేపర్ ఛాంబర్, 2600 నెట్స్ అడాప్టివ్ డిస్ప్లే వంటి అత్యంత అధునాతన ఫీచర్లు ఎన్నో ఈ గెలాక్సీ AI సిరీస్ ఫోన్లు కలిగి ఉన్నాయని ఆయన వివరించారు.
జీరో డౌన్ పేమెంట్ తో..
ఈ మొబైల్స్ కొనుగోళ్ల కొరకు తమ షోరూమ్స్ అన్నిట్లోనూ జీరో డౌన్ పేమెంట్, 24 నెలల నో కాస్ట్ EMI వంటి సదుపాయాలు లభిస్తాయని ఆయన తెలిపారు. అంతేకాక ఈ మొబైల్స్ కొనుగోలుపై రూ. 16000 వరకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్, రూ 18,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తాయని ఆయన వివరించారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రజానీకం అంతా ఈ శాంసంగ్ గెలాక్సీ AI సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసి ఈ అత్యాధునిక సాంకేతికతను, అద్భుతమైన ఆనందానుభూతులను సొంతం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.