Saturday, November 23, 2024
HomeతెలంగాణHyd: బీజేపీ వ్యక్తే పేపర్ లీక్ లో సూత్రధారి: తలసాని

Hyd: బీజేపీ వ్యక్తే పేపర్ లీక్ లో సూత్రధారి: తలసాని

ఉద్యోగాల భర్తీ చేస్తుంటే యువత తమ పార్టీ వైపు ఉండరని బీజేపీ బండి సంజయ్ ఆన్న మాటలు గతంలో చూసినట్టు తలసాని గుర్తుచేశారు. తమ పార్టీ, ప్రభుత్వం లక్ష్యం ఒక్కటేనని, నిరుద్యోగులు ఉండొద్దు, ఉద్యోగాలు సాధించి వారంతా బాగు పడాలని తాము కోరుకుంటున్నట్టు తలసాని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉద్యోగాల భర్తీ లో స్కాం లు జరిగిన విషయాన్ని ఈసందర్భంగా తలసాని గుర్తుచేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు.

- Advertisement -

చదువుకునే వారికి ఉద్యోగాలు రావాలనే లక్ష్యం తో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపడుతూంటే బీజేపీ దాన్ని కుట్రలతో అడ్డకుని కుంభకోణాలకు పాల్పడుతోందని నిప్పులు చెరిగారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలో ఉద్యోగాలకు తమ సర్కారు నోటిఫికేషన్ ఇస్తూంటే, జగిత్యాల వాసి బీజేపీకి చెందిన రాజశేఖర్ రెడ్డి పేపర్ లీకేజ్ కుట్రకు పాల్పడ్డట్టు తలసాని ఆరోపించారు. దోషులు ఎవరైనా సిట్ అధికారులు వదిలిపెట్ట రాదని, ఈ విషయంపై బీజేపీ రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేస్తోందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News