Thursday, April 3, 2025
HomeతెలంగాణHyd: బిఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ

Hyd: బిఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ

బిఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ ఎంతగానో ఉందని అమీర్‌పేట‌ డివిజన్ మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి అన్నారు. డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ది చెందుతున్న తీరు అద్భుతం అని కొనియాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారు అని చెప్పారు. మరోసారి బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు హనుమంత్ రావు, నాయకులు సంతోష్, ప్రవీణ్ రెడ్డి, మోత్కుపల్లి రమేష్, రామానంద, రాజు, సంపత్, కూతురు నరసింహా, వనం శ్రీనివాస్, కట్ట బలరాం, లలిత చౌహాన్, లక్ష్మి, అరుణ, అనిత, రాణి కౌర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News