Sunday, June 30, 2024
HomeతెలంగాణHyd: బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్

Hyd: బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్న పార్టీ ఇంచార్జిలు, పార్టీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ఈ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు.
వచ్చేనెల 29 నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలి ఇందుకు సంబంధించి, ఇప్పటికే జిల్లా ఇన్చార్జిల్గా వెళ్లిన వారి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కార్యకర్తలకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారని దాన్ని అన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలని కేటీఆర్ ఈ భేటీలో ప్రస్తావించారు.

- Advertisement -

మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ గారి ఆత్మీయ సందేశం పంపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News