Monday, July 8, 2024
HomeతెలంగాణHyd: కౌన్సిల్ డిప్యుటీ ఛైర్మన్ పదవికి బండా ప్రకాశ్ నామినేషన్

Hyd: కౌన్సిల్ డిప్యుటీ ఛైర్మన్ పదవికి బండా ప్రకాశ్ నామినేషన్

శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి కి తన నామినేషన్ పత్రాలను కార్యదర్శి నరసింహ చార్యులకు ఎమ్మెల్సీ బండ ప్రకాష్ సమర్పించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు ప్రకాశ్ నామినేమిన్ వేశారు.

- Advertisement -

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా నామినేషన్ వేసిన అనంతరం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్సీ బండ ప్రకాష్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News