Saturday, November 15, 2025
HomeతెలంగాణHeart Attack: గుండెపోటుతో కుప్పకూలుతున్న యువత.. గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ కానిస్టేబుల్‌ మృతి

Heart Attack: గుండెపోటుతో కుప్పకూలుతున్న యువత.. గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ కానిస్టేబుల్‌ మృతి

Heart Attack: గుండెపోటుతో కుప్పకూలుతున్న యువత.. గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ కానిస్టేబుల్‌ మృతి

- Advertisement -

Constable died by Heart Attack: మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటు బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గతంలో వృద్ధులు మాత్రమే గుండెపోటుకు గరయ్యే వారు. కానీ ఇటీవలి కాలంలో యువకులు, చిన్న పిల్లలు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. దీంతో గుండె పోటు కేసులు నానాటికి పెరుగుతున్నాయి. అప్పటివరకు సంతోషంగా తమతో గడిపిన వారు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రస్తుతం ఆందోళనకరంగా మారాయి.. తాజాగా, ఓ యువ కానిస్టేబుల్‌ గుండెపోటుకు గురై చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ శివారులోని ఘట్‌కేసర్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న డేవిడ్‌ (31) మల్కాజిగిరి విష్ణుపురికాలనీలో నివాసం ఉంటున్నాడు.. గణేష్ నిమజ్జనోత్సవంలో భాగంగా ఆదివారం ఆనంద్‌బాగ్‌లో నృత్యం చేస్తూ డేవిడ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు వెంటనే అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు డేవిడ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే.. అతని పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు డేవిడ్ ను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం డేవిడ్ అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కానిస్టేబుల్‌ డేవిడ్‌కు భార్య, మూడు నెలల పాప ఉందని సీఐ సత్యనారాయణ తెలిపారు.

మరో ఘటనలో 45 ఏళ్ల వ్యక్తి..

ఈ ఘటన మరువక ముందే తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనంలో డాన్స్‌ చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలాడు. నారాయణ పేట జిల్లా సింగార్ కాలనీలో నివసించే శాసన్ పల్లి శేఖర్‌ (45) తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గణేషుని నిమజ్జనంలో సంతోషంగా పాల్గొన్నారు. డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. అంతలోనే ఆనందం కాస్త విషాదంగా మారింది. నిమజ్జనం ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న ఎస్సై వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి వేణుగోపాల్​ ఆయనకు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపే శేఖర్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు రావడమే మృతికి కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్యాన్సు చేయడం ద్వారా అధిక శారీరక శ్రమ, అలసట, తీవ్రమైన ఉద్వేగం కారణంగా ఈ సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రోజురోజుకు గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad