గీత పనివారల సంఘం ఏర్పాటు చేసి, గౌడ కులస్తుల హక్కుల కోసం చివరి వరకు పోరాడిన కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం అంటూ కొనియాడారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారంటూ ధర్మభిక్షంకు నివాళి అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో నీరాను ప్రవేశపెట్టాలని సుదీర్ఘ కాలంగా పోరాడారని ఈసందర్భంగా శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేసుకున్నారు. రవీంద్ర భారతి ప్రధాన ఆడిటోరియంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు, మాజీ ఎంపీ, కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం శతజయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.