సంపన్నులకు రాయితీలు సామాన్యులపై పన్నులు వేసే కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఎం దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించింది. హైదరాబాదులో ఆదాయ పన్ను శాఖ కార్యాలయం ముందు సిపిఎం ఆందోళన సాగింది. కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు లక్షల కోట్ల రాయితీలిస్తూ ఆహార పదార్థాలు, మెడిసిన్స్ పై జీఎస్టీ విధించే విధానాలపై సిపిఎం ఆదాయపన్ను శాఖ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం జరిపింది. ధర్నానుద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు, నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్, నగర కార్యదర్శివర్గ సభ్యులు కే నాగలక్ష్మి, ఎం మహేందర్ లు మాట్లాడారు.
దేశంలో అతి సంపన్నులు పెరిగిపోతున్నారు, వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పన్ను మినహాయింపులిస్తోందని, వారిపై పన్ను మినహాయింపులను రద్దు చేస్తూ, సంపద పన్ను విధించాలని సీపీఎం డిమాండ్ చేసింది.