తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఉద్యమ నేతగా, సంక్షేమ ప్రదాతగా, దేశానికి దిక్సూచిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలుగుప్రభ దినపత్రిక పుస్తకాలను ప్రచురించటాన్ని రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ పత్రిక నిర్వాహకులను, జర్నలిస్టులను అభినందించారు.
సంక్షేమ పథకాలపై ఆంగ్లంలో ప్రచురించిన ‘కేసీఆర్ డ్రీమ్స్-తెలంగాణ విన్స్’ పుస్తకంతో పాటు ‘కేసీఆర్ ది పాత్-బ్రేకింగ్ జర్నీ ఆఫ్ ఎ విజినరీ లీడర్’ పుస్తకాలను మంగళవారం సంతోష్ కుమార్ ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి సమాచారం సేకరించిన విధానం బాగుందని జర్నలిస్టులను ఆయన కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ సారథిగా, ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా, దార్శనిక పరిపాలకుడిగా, బంగారు తెలంగాణ నిర్మాతగా, భావి భారతానికి పరిపాలనా దిక్సూచిగా కేసీఆర్ గురించి పుస్తకంలో అందించిన వివరాలు రాజకీయ నాయకులకు మార్గదర్శకత్వం చేసేలా ఉందని పేర్కొన్నారు. ఈ పుస్తకావిష్కరణలో తెలుగుప్రభ ఎడిటర్-పబ్లిషర్ సమయమంత్రి చంద్రశేఖర శర్మ, ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ జీ రాజసుక, నెట్వర్క్ ఇంఛార్జ్ కే గౌతం పాల్గొన్నారు.
Celebrating the visionary journey of KCR in Telugu with '#DeshanikiDiksuchiKCR' and his dream for Telangana's success in English with 'KCR Dreams, Telangana Wins,' meticulously researched and presented by Sri Samayamantri Chandrashekhara Sharma garu. A remarkable effort of… pic.twitter.com/Y2kejKXmxf
— Santosh Kumar J (@SantoshKumarBRS) October 3, 2023