తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక శిభిరాన్ని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈకార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు అధికారులు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. కంటివెలుగు పథకం దేశంలోనే గొప్ప కార్యక్రమం అంటూ స్పీకర్ పోచారం మీడియాతో అన్నారు.
ఆతరువాత ఎంఐఎం శాసన సభ్యులు అక్బరుద్దీన్, పాషా ఖాద్రి, ముంతాజ్ ఖాన్ లను అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటివెలుగు స్టాల్ ల వద్దకు స్వయంగా దగ్గర ఉండి తీసుకువచ్చి.. ఎమ్మెల్యేలకు పరీక్షలు చేయించారు మంత్రి హరీష్ రావు. కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా ఉందని ఎంఐఎం శాసన సభ్యులన్నారు.