Saturday, November 15, 2025
HomeతెలంగాణHyd: కేసీఆర్ బర్త్ డే కేక్ కట్ చేసిన మంత్రులు

Hyd: కేసీఆర్ బర్త్ డే కేక్ కట్ చేసిన మంత్రులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీలో బర్త్ డే వేడుకలకు బ్రహ్మాండంగా సాగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు . రాష్ట్రం అంతటా నేడు ఒక పండుగలా కేసీఆర్ గారి పుట్టిన వేడుకలు జరిగాయి అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పార్టీ సెక్రెటరీ జనరల్ కె. కేశవరావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ ఏంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ వాణి దేవి, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad