వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, ఖాయితీ లంబాడాలు, మాలి సహా బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలు, చమర్ మధురాలు, చుండువాల్లు, తలయారి కులాలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం ప్రకటించిన సందర్భంగా.. పలువురు ప్రజా ప్రతినిధులు, ఆయా కుల సంఘాల నేతలు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని అసెంబ్లీలోని సిఎం చాంబర్ లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి, వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గద్వాల కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి. అబ్రహాం, దేవకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి సహా ఇతర ప్రాంతాల నేతలు, ఆయా నియోజకవర్గాలకు చెందిన కుల సంఘాల నేతలున్నారు.