Sunday, September 8, 2024
HomeతెలంగాణHyd: మాయావతి శకం ముగిసింది: బాలరాజు

Hyd: మాయావతి శకం ముగిసింది: బాలరాజు

బీఎస్పి అధినేత్రి మాయావతి హైదరాబాద్ కు వస్తున్నారంటే దళితులు ఉత్కంఠ గా ఎదురు చూశారని అన్నారు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. రాజకీయాల్లో మాయావతి శకం ముగిసిందని, కేసీఆర్ దళిత జాతిలో పుట్టక పోయినా అణగారిన వర్గాల కోసం ఎంతో చేస్తున్నారని..కేసీఆర్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పకపోగా ఆమె విమర్శించారన్నారు బాలరాజు. కేసులకు భయపడి మాయావతి బీఎస్పీని బీజేపీకి తోక పార్టీగా మార్చేశారని ఆయన ఆరోపించారు.
తన ప్రసంగం లో బీజేపీ ని పల్లెత్తు మాట కూడా అనని మాయావతి తీరును చూసి కాన్షీరాం ఆత్మ కూడా క్షోభిస్తోందన్నారు. కాన్షీరాం స్థాపించిన పార్టీ కదా అని బీ ఎస్ పి గురించి ఒక మాట అనాలంటే వెనకంజ వేసే వాళ్ళమని, కానీ మాయావతి కాన్షిరాం సిద్ధాంతాలను పూర్తిగా తుంగలోకి తొక్కారు కనుక బీఎస్పీని విమర్శించక తప్పదన్నారుయ మాయావతి భయపడుతున్న తీరు చూస్తుంటే ఆమె కచ్చితంగా ఆర్థిక నేరాలకు పాల్పడిందనిపిస్తోందన్నారు. దళితులకు మాయావతి ద్రోహం చేస్తున్నారని, .బీఎస్పీ రాష్ట్ర నేత ప్రవీణ్ కుమార్ పై కేసీఆర్ కొండంత నమ్మకముంచి గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆరేళ్లు అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ప్రవీణ్ తన పదవిని దుర్వినియోగం చేసి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అపుడు సృష్టించిన సైన్యాన్ని ఇపుడు రాజకీయాలకు వాడుకుంటూ ప్రవీణ్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారన్నారు.
కేసీఆర్ ఆదరణ లేకుంటే ప్రవీణ్ కుమార్ కోన్ కిస్కా లా ఉండే వారని, బీఎస్పీ ప్రభావం వల్లే అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు అని మాయావతి అనడం హాస్యాస్పదమన్నారు. దళిత బంధు ఆలోచన మాయవతికి అధికారంలో ఉండగా ఎందుకు రాలేదని, .ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కేసీఆర్ లాగా మాయావతి ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. ప్రవీణ్ సత్తా ఏమిటో మునుగోడు ఉపఎన్నికలో తేలిపోయిందని, బీఎస్పీకి నాలుగు వేల ఓట్లు కూడా రాలేదన్నారు. ప్రవీణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా బీఎస్పీ తెలంగాణలో లేచే పరిస్థితి లేదన్నారు. .బీజేపీ ఆలోచనలను బీఎస్పీ ప్రవీణ్ కుమార్ ను ముందు పెట్టి అమలు చేస్తోందని, .మాయావతి యూపీ ముఖ్యమంత్రిగా అంబేడ్కర్ విగ్రహాలు కాకుండా ఏనుగు విగ్రహాలను ప్రతిష్టించారని ఆయన ఆరోపించారు. మాయావతి ఓ అసమర్ధ నాయకురాలిగా మిగిలిపోవద్దని ఆయన హెచ్చరించారు. బీజేపీ మతతత్వ రాజకీయాలను ప్రశ్నించలేకపోతే బీ బీఎస్పీ కి మనుగడ లేదని, ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో సుద్ద పూస లా మాట్లాడుతున్నారని, బీఎస్పీ సభకు డబ్బులు ఎక్కడనుంచి వచ్చాయో ప్రవీణ్ చెబితే మంచిదని బాలరాజు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News