Tuesday, September 10, 2024
HomeతెలంగాణHyd Metro: హైదరాబాద్ మెట్రో కి షాక్ ఇచ్చిన ఉద్యోగులు

Hyd Metro: హైదరాబాద్ మెట్రో కి షాక్ ఇచ్చిన ఉద్యోగులు

హైదరాబాద్ మెట్రో కి సమ్మె సెగ తాకింది. దీంతో న్యూ ఇయర్ లో ఎల్ అండ్ టీ మెట్రోకు పెద్ద షాక్ తగిలింది. మెట్రో స్టేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీసం భోజనం చేయడానికి కూడా బ్రేక్ దొరకదని, రిలీవర్స్ రాక తామ తీవ్ర ఒత్తిడిలో ఉద్యోగం చేయాల్సిన దుస్థితిలో ఉన్నట్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. తమకు కనీసం లీవులు కూడా మంజూరు చేయటం లేదని వీరు మండిపడుతున్నారు. దీంతో సమ్మెకు దిగిన కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ సమ్మెకు దిగారు. దీంతో మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెడ్ లైన్ – మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో స్టేషన్ లలో టికెట్ వ్యవస్థ స్తంభించిపోయింది. మియాపూర్ నుండి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగుల విధుల బహిష్కరణతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని ఆందోళనలో ఉన్న ఉద్యోగులు.. 11 వేల రూపాయలకు మాత్రమే అందుకుంటున్నట్టు వాపోతున్నారు. దీంతో వీరంతా 15 వేల-18 వేల రూపాయల వరకు జీతం పెంచాలని డిమాండ్ కు దిగారు. సమ్మె దెబ్బకు 150 మంది ఉద్యోగులు విధులు బైకాట్ చేయటంతో.. అమీర్ పెట్, మియాపూర్ మెట్రో స్టేషన్ లలో టికెట్ల కోసం ప్రయాణికులు క్యూ కట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News