Saturday, November 23, 2024
HomeతెలంగాణHyd: ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలి

Hyd: ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలి

ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలని కోరుతూ, ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మంత్రి హరీశ్ రావు ని హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద కలిశారు. ఉపాధి హామీ పథకం మొదలైన నాటి నుండి పనిచేస్తున్న ఉద్యోగులు చాలీచాలని వేతనాలతోనే కాలం వెల్లదీస్తున్నారని వారు మంత్రికి చెప్పారు. దేశంలోనే మన రాష్ట్రం ఉపాధి హామీ లో నెంబర్ వన్ గా నిలవడం లో ఉపాధి హామీ ఉద్యోగుల పనితనం, ప్రతిభ కూడా దాగి ఉందని చెప్పారు. వాళ్ల పనికి తగిన విధంగా వేతనాలు అందాలంటే, వాళ్లకు పే స్కేల్ వర్తింప చేస, అమలు చేయాలని, ఇందుకు తగిన విధంగా ఆలోచించి, దయామయులైన మంత్రి గారు, మనసున్న మహారాజు సీఎం గారిని ఒప్పించాలని వారు కోరారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ, సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.

- Advertisement -

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వారిలో MGNREGA రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎ. లింగయ్య, కో చైర్మన్లు అంజిరెడ్డి, విజయ్ వెంకటరామిరెడ్డి, మోహన్ రావు, రఘు, జిల్లా జేఏసీ చైర్మన్లు ఉన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,874 మంది ఉపాధి హామీ ఉద్యోగులు పే స్కేల్ కోసం జేఏసీ గా ఏర్పడ్డారు. Serp ఉద్యోగులకు మాదిరిగా తమకు కూడా పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, 62 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యేలు, 4 గురు ఎంపీ లు, ఇద్దరు మహిళా కమిషన్ చైర్మన్ లు, తదితరుల నుంచి మద్దతు లేఖలు సేకరించారు. తమ డిమాండ్ సీఎం కెసిఆర్ చేరేలా ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News