Friday, April 11, 2025
HomeతెలంగాణHyd: నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ ప్రత్యేక విభాగాలున్న ఏకైక రాష్ట్రం మనదే

Hyd: నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ ప్రత్యేక విభాగాలున్న ఏకైక రాష్ట్రం మనదే

శాంతిభద్రలతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మరింత పెరుగుతుందని హైదరాబాద్ సీపీ సి.వి. ఆనంద్ అన్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులతో నూతన సభ్యత్వ సమావేశాన్ని సిటీ పోలీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ మెగాసిటీ పోలీసింగ్ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. జనాభా పెరుగుదలను గుర్తించి అందుకు తగిన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాల పనిచేస్తోందన్నారు. నార్కోటిక్స్ బ్యూరో, సైబర్ క్రైమ్ కోసం ప్రత్యేక విభాగాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు, సైబర్ క్రైమ్ నియంత్రణకు 4,000మంది అదనపు సిబ్బందిని ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. మూడు కమిషనరేట్లు ఈ అంశాలపై ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నాయని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News