Saturday, November 15, 2025
HomeతెలంగాణHyd: జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ తో సీఎస్, డీజీపీ భేటీ

Hyd: జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ తో సీఎస్, డీజీపీ భేటీ

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఒకరోజు పర్యటనకు హైదరాబాద్ కు వచ్చిన హన్సరాజ్ గంగారామ్ ను హరితా ప్లాజాలో కలసి తెలంగాణా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పధకాలను సీఎస్ శాంతా కుమారి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీలకు రిజర్వేషన్లు, రిజర్వేషన్ రోస్టర్ అమలుపై బీసీ కమిషన్ చైర్మన్ కు సి.ఎస్ వివరించారు. వీరితోపాటు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సలహాదారు రాజేష్ కుమార్ కూడా వచ్చారు.
అనంతరం మెదక్‌లోని జీఎం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ సీఎండీ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌), హైదరాబాద్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఉస్మానియా, డీడీ న్యూస్‌ రీజినల్‌ హెడ్‌తో జాతీయ బీసీ కమీషన్ చైర్మన్ భేటీ అవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad