రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన నీరాను అందించేందుకు నీరాను, అనుబంధ ఉత్పత్తులైన తేనె, బూస్ట్, షుగర్, బెల్లం లను రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…గీత వృత్తి ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతు భీమా మాదిరిగా గీత కార్మికుల కోసం 5 లక్షల రూపాయల భీమా’ ను కల్పించినందుకు సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 ఏండ్ల వయస్సు పైబడిన, అర్హులైన దాదాపు లక్షమంది గీత కార్మికులకు ప్రతి నెల 2016 రూ. ల పెన్షన్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
మద్యం దుకాణాలలో దేశంలో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీ ఎస్టీలకు 15% రిజర్వేషన్లు కల్పించటం సాహసోపేతమైన చారిత్రాత్మక నిర్ణయం గా అభివర్ణించారు.
గీత వృత్తి ప్రోత్సాహం కోసం
తెలంగాణకు హరితహారంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 4 కోట్ల 20 లక్షల తాటి, ఈత మొక్కలు నాటామన్నారు. తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికి వేసే వారిపై చట్టపరమైన కటిన చర్యలు, కేసులు నమోదు చేస్తున్నామన్నారు. తాటి , ఈత చెట్ల రెంటల్ శాశ్వతంగా రద్దు చేశామనీ వెల్లడించారు. గీత కార్మికుల గత బకాయిలు సుమారు 8 కోట్ల రూపాయలను రద్దు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుడుంబా నిర్మూలనలో భాగంగా పునరావసం కోసం SC లకు 1068, ST లకు 2351, 2700 మంది BC లకు, others 125 , మొత్తం 6299 మంది కి ఒక్కొక్కరికీ 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 125 కోట్ల 98 లక్షల గ్రాంట్ ను ఇచ్చామన్నారు.
గీత వృత్తి లో మరణించిన వారికి గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా ను 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే, శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి గతంలో ఇచ్చిన 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని 5 లక్షల రూపాయల కు పేంచడం జరిగిందన్నారు. కల్లు దుకాణాలు నెలవారి కిస్తీ మరియు తాటి, ఈత చెట్ల పన్ను రద్దు చేయడం ద్వారా 7743 కల్లు దుకాణాలకు చెందిన 2లక్షల 34 వేల 576 కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.
ప్రమాదవశాత్తు గీత వృత్తి లో తాటిచెట్టు నుండి పడి చనిపోయిన 777 మంది గీత కార్మికులకు, 1966 మంది శాశ్వత అంగ వైకల్యం చెందిన గీత కార్మికులకు 5లక్షల రూపాయలు, తాత్కాలిక వైకల్యం చెందిన 2725 మంది గీత కార్మికులకు మొత్తం 5468 కుటుంబాలకు 63 కోట్ల 55 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో అందించామనీ వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన నీరాను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా నీరా పాలసిని ప్రవేశపెట్టామన్నరు. తెలంగాణ రాష్ట్రంలో గీత వృత్తిదారులు మాత్రమే నీరాను ఉత్పత్తి, అమ్మకాలు జరిపేలా నీరాపాలసిని రూపొందించామన్నారు. గీత కార్మికులకు లైసెన్సుల కాలపరిమితిని 5 ఎండ్ల నుండి 10 ఎండ్ల వరకు పెంచడం జరిగిందనీ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో గీత పారిశ్రామిక సహకార సంఘాల ( కల్లు దుకాణాలను) ను రద్దు చేశారనీ అవేదన వ్యక్తం చేశారు. కల్లు అమ్మకాలపై నిషేధం విధించారు. గీత వృత్తిని ప్రశ్నార్థకం చేసే కుట్ర జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో రద్దు చేసిన కల్లు దుకాణాలను తెరిపించి గీత కార్మికుల ఆత్మగౌరవాన్ని నిలిపెందుకు కృషి చేస్తున్నామన్నారు. వందల కోట్ల విలువైన గౌడ ఆత్మగౌరవ భవనానికి 5 ఎకరాల భూమి కేటాయించారాన్నరు. ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించేందుకు 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతిలో తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికులు వందల ఏళ్ల నుంచి వేలాది మంది గీత కార్మికులు మరణించారు, శాశ్వత అంగ వైకల్యం చెందారన్నారు. గీత కార్మికులు ఎంతో సాహసోపేతంగా గీత వృత్తిని కొనసాగిస్తున్నారనీ వెల్లడించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నామన్నరు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోటలను పరిరక్షించి వాటిని పురావస్తు కేంద్రాలుగా, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే భువనగిరి కోట జాఫర్ ఘడ్ కోట, కిలాషా పూర్ కోట, తాటికొండ కోట, కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం పాపన్నపేట లో ఉన్న సుమారు 400 ఎకరాల కోట గ్రానైట్ మాఫియా నుండి పరిరక్షించామన్నారు.పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గీత వృత్తిలో ప్రమాదవశాత్తు జరిగే మరణాలను నివారించేందుకు అధునాతన తాటి చెట్టు ఎక్కే యంత్రాల ‘రక్షిత మోకు’ రూపకల్పన కోసం ను IIT లాంటి సాంకేతికత సంస్థల సహకారంతో పరిశోధనలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూపొందించిన ‘రక్షిత మోకు’ లను 1 లక్ష 45 వేల 481 మంది గీత కార్మికుల కు అందించడం జరుగుతుందన్నారు. గీత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో గీత కార్మికుల కోసం రైతు బీమా తరహాలో ‘గీత కార్మికుల భీమా’ ను ప్రవేశపెట్టినందుకు, గౌడ కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆత్మ గౌరవంతో జీవించేందుకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు, KTR గార్లకు గీత కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం రాష్ట్ర మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ గీత వృత్తిదారులకు రైతు భీమా తరహాలో గీత కార్మికుల భీమాను ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి KTR గార్ల చిత్రపటానికి ప్రతిష్టాత్మక నీరా కేఫ్ ముందు ‘నీరాభిషేకం’ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, రాష్ట్ర చైర్మన్లు డాక్టర్ ఆంజనేయ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ మంత్రి రాజేశం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం గౌడ్, మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన స్వామీజీలు ప్రణవానంద స్వామి, నిచ్చల్ నిరంజన్ దేశ్కందు స్వామి , మూర్తి స్వామి , తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ల సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి గౌడ్, ఆర్టిఏ అధికారులు చక్రవర్తి గౌడ్, తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అజయ్ కుమార్ డేవిడ్ రవికాంత్, ఖురేషి, దత్తరాజ్ గౌడ్ ,చంద్రయ్య గౌడ్, సత్యనారాయణ, రవీందర్ రావు, అరుణ్ కుమార్, విజయ భాస్కర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్, చింతల మల్లేశం గౌడ్, బాలగోని బాలరాజ్ గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, ఆయిలీ వెంకన్న గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్, బొమ్మగోని ప్రభాకర్ గౌడ్, నూతి సత్యనారాయణ గౌడ్, కూరెళ్ళ వేములయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, అమరవేణి నర్సా గౌడ్, ఎంవి రమణ గౌడ్, మోర్ల ఏడుకొండలు గౌడ్, నాచగోని రాజయ్య గౌడ్, బింగి భరత్ గౌడ్, గుండాల మల్లేశం గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ప్రతాప్ లింగం గౌడ్, సంజయ్ గౌడ్, బత్తిని కీర్తీ లతా గౌడ్, మమతా గౌడ్, గీత గౌడ్, అనురాధ గౌడ్ , విజయలక్ష్మి గౌడ్ , మానస గౌడు, సుర్వి యాదయ్య గౌడ్, కటికం సత్తయ్య గౌడ్, ఈతమ్ముళ్లు ప్రసాద్ గౌడ్ , నరసింహ గౌడ్, నకరికంటి కాశయ్య గౌడ్, ప్రసాద్ గౌడ్, బోయపల్లి శేఖర్ గౌడ్, వడ్డేపల్లి గోపాల్ గౌడ్, కారింగు నరసింహ గౌడ్, వివిధ జిల్లాల నుండి వేలాదిగా తరలివచ్చిన గౌడ సంఘాల ప్రతినిధులు గీత వృత్తిదారులు కార్మికులు పాల్గొన్నారు.