Sunday, July 7, 2024
HomeతెలంగాణHyd: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మెరిసిన యువ నేత పాడి కౌశిక్ రెడ్డి

Hyd: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మెరిసిన యువ నేత పాడి కౌశిక్ రెడ్డి

కుమార్తె శ్రీనికతో కలిసి గోల్కొండ కోటలో..

హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, యువ నేత పాడి కౌశిక్ రెడ్డి మెరిసారు. ఆయన తన కుమార్తె శ్రీనిక రెడ్డితో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. వేడుకల్లో కౌశిక్ రెడ్డి ఆయన కుమార్తె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం కేసీఆర్ ను కలిసి కౌశిక్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

కౌశిక్ రెడ్డి కుమార్తె శ్రీనిక సీఎం కెసిఆర్ తో సెల్ఫీ తీసుకోవడం అందరిని ఆకర్షించింది. ఎమ్మెల్సీ కవితను కలిసి సెల్ఫీ తీసుకుంది. గ్యాలరీలో సెల్ఫీలు తీసుకొని సందడి చేసింది. ఎమ్మెల్సీ కవితకు కౌశిక్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి కౌశిక్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News