Sunday, July 7, 2024
HomeతెలంగాణHyd: పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ లో క్వాలిటీ కంట్రోల్ విభాగం మరింత పటిష్టం

Hyd: పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ లో క్వాలిటీ కంట్రోల్ విభాగం మరింత పటిష్టం

తెలంగాణా పోలీస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో జరిగే పోలీస్ కార్యాలయాల భవనాల నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టేందుకు ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని పటిష్ఠపర్చడం, అకౌంట్స్ ను మరింత పక్కాగా నిర్వహించడానికి ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాన్ని ఏర్పాటు చేయడంతోపాటు పలు నిర్ణయాలను నేడు జరిగిన తెలంగాణా పోలీస్ హోసింగ్ కార్పోరేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో నిర్ణయించారు. కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీజీపీ అంజనీ కుమార్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, పోలీస్ కార్పోరేషన్ ఎం.డి. రాజీవ్ రతన్, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఫెయిర్ సర్వీస్ డీజీ నాగిరెడ్డి, డీఐజీ రమేష్ రెడ్డి, కార్పోరేషన్ సి.ఈ విజయ్ కుమార్, రక్షిత మూర్తి లు హాజరయ్యారు. ఈ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ క్రింది నిర్ణయాలను తీసుకున్నారు.
*పోలీస్ హోసింగ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణ పనులలో మరింత నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ప్రస్తుతం ఉన్న క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని పటిష్టం చేయాలనీ, ఈ విభాగంలో నిపుణులైన అధికారులను తీసుకోవాలని నిర్ణయించారు.
స్తుతం ఉన్న అకౌంట్స్ విభాగాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఫైనాన్స్, అకౌంట్స్ విభాగానికి ప్రత్యేకంతా సీనియర్ అధికారిని డిప్యుటేషన్ పద్ధతిపై నియమించాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News