సమకాలీన రాజకీయాలు, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సీనియర్ పాత్రికేయుడు సమయమంత్రి చంద్రశేఖర శర్మ రాసిన వ్యాసాల సంపుటి ‘మననం’ అనే పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారు, మాజీ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ అంబేద్కర్ సెక్రెటేరియట్ లోని ఆయన ఛాంబర్ లో బుధువారం ఆవిష్కరించారు. ఈ గ్రంథాన్ని ఆవిష్కరించిన సోమేష్ కుమార్ పుస్తక రచయితను అభినందిస్తూ.. “ ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా తనదైన బావ, భాషాశైలిలో శర్మ రాసిన వ్యాసాలు సమాజాన్ని ఆలోచింపచేస్తాయ”ని పేర్కొన్నారు. ‘మననం’ శీర్షికన ‘మనం’ పత్రికలో ప్రతి ఆదివారం ఈ వ్యాసాలు 2017-18 సంవత్సరంలో ప్రచురితమై విశేష పాఠకాదరణ పొందాయి. సుమారు 70 వ్యాసాల సంపుటి ‘మననం’ పేరుతో శ్రీజనచైతన్య పబ్లికేషన్ ప్రచురించింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా పాల్గొని, గ్రంధ రచయితను అభినందించారు.