కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ మరియు మిథిలా నగర్ లలో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.