Thursday, April 3, 2025
HomeతెలంగాణHyd: పాదయాత్రలు కావవి అంతిమ యాత్రలు

Hyd: పాదయాత్రలు కావవి అంతిమ యాత్రలు

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు చేస్తున్నవి పాదయాత్రలు కావని..కాంగ్రెస్, బీజేపీల అంతిమ యాత్రలని పీయూసీ చైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆయన..నేరచరిత్ర ఉన్న రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత పీసీసీ ప్రదేశ్ “క్రిమినల్స్”సెంటర్ గా మారిందన్నారు. ఇలాంటి క్రిమినల్స్ ను ప్రోత్సహిస్తూ ఏఐసీసీ ఆలిండియా “క్రైమ్” సెంటర్ అవుతోందన్నారు. “రేవంత్ రెడ్డి పార్టీలు మారే ఊసరవెల్లని..రేవంత్ ప్రజల బతుకులతో జూదమాడే ఒక ప్రిజనరీ అంటూ ధ్వజమెత్తారు. రేవంత్, బండి సంజయ్ లది ఉగ్రవాద ఉన్మాద భాషని.. కూల్చివేతలు, పేల్చివేతలు అంటూ పిచ్చిపిచ్చిగా వాగుతున్నారన్నారు జీవన్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News