Friday, November 22, 2024
HomeతెలంగాణHyd: పర్యాటక శాఖ భూముల అవకతవకలపై కఠిన చర్యలు

Hyd: పర్యాటక శాఖ భూముల అవకతవకలపై కఠిన చర్యలు

ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు ఇష్టానుసారంగా తెలంగాణలోని హైదరాబాద్ లోని, సమీపంలో ఉన్న విలువైన పర్యాటక భూములను అయా సంస్థలకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ చెందిన లీజు నిబంధనలు పాటించకుండా ప్రాజెక్టులు చేపట్టకుండా ఉన్నా వారిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన వివరించారు. టూరిజం భూములను ఏ అవసరాలకు తీసుకున్నారో ఆ అవసరాలకు ఉపయోగించుకోకుండా ప్రభుత్వానికి లీజులను చెల్లించకుండా, లీజు నిబంధనలు పాటించని, చట్టంలోని లొసగులను అడ్డం పెట్టుకొని కాలయాపన చేస్తున్న సంస్థలపై  చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గత టూరిజం సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ టూరిజం శాఖ అధికారులు న్యాయ పరమైన చర్యలు చేపట్టారు. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు టూరిజం శాఖ అధికారులు ఏడాది కాలంలోనే పాత బకాయిలు 50 కోట్లు వసూలు చేశారు.  పర్యాటక శాఖకు చెందిన సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన 2 స్థలాల లీజులు రద్దు చేస్తూ 2 స్థలాలను స్వాధీనం  చేసుకున్నారు.

- Advertisement -

న్యాయపరమైన చర్యలు..

పర్యాటక శాఖ అధికారులు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా న్యాయంగా వ్యవహరించి 1000 కోట్ల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేయడం లో నిర్విరామ కృషి చేసిన పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, MD. మనోహర్, OSD సత్యనారాయణ, లీగల్ ఆఫీసర్ ఆదిల్ లను ప్రత్యేకంగా  మంత్రి అభినందించారు.  ఈమేరకు మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలంగాణ పర్యాటకశాఖ కు చెందిన లీజు నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు చేపట్టి సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన భూములను పర్యాటక శాఖ తిరిగి స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు.

ప్రజయ్ ఇంజినీర్స్

షామీర్ పెట్ లోని జవహర్ నగర్ లోని సర్వే నెంబర్ 12లో సికింద్రాబాద్ గోల్ఫ్ కోర్స్ అభివృద్ధి పేరుతో ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ సంస్థ 130 ఎకరాల టూరిజం శాఖకు చెందిన భూమిని 2004 సంవత్సరంలో తీసుకుని లీజు నిబంధనలు పాటించని  కారణంగా సంస్థపై చర్యలు తీసుకుని భూమిని స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి తెలిపారు. సికింద్రాబాద్లోని యాత్రి నివాస్ పక్కన ఉన్న 4600 గజాల విలువైన భూమిని E – City Giant Screen (India) Pvt Ltd సంస్థ లీజు నిబంధనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నందున లీజును రద్దు చేస్తూ తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని మంత్రి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News