Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: ఆదివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ మళ్లింపు

Hyd: ఆదివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ మళ్లింపు

సండే ఫండే కార్యక్రమం నేపథ్యంలో అప్పర్ ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ అనుమతించమని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు మళ్లింపు అమలులో ఉంటుందన్నారు. లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మినార్ వైపు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం నుంచి లిబర్టీ వైపు, ఇక్బాల్ మినార్ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను పాత సెక్రటేరియట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారని పేర్కొన్నారు.

- Advertisement -

కర్బలా మైదానం నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ డిబిఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ దేవాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ల మీదుగా పంపిస్తారన్నారు. డిబిఆర్ మిల్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోశాల, కవాడిగూడ, జబ్బార్ కాంప్లెక్స్, బైబిల్ హౌజ్ వైపు మళ్లిస్తారని వివరించారు. అది విధంగా సండే ఫండే కార్యక్రమానికి అంబేడ్కర్ విగ్రహం వైపు వచ్చే ఔత్సాహికులకు వచ్చే లేపాక్షి, న్యూఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో, కర్బలా మైదానం వైపు నుంచి వచ్చే వారికి సెయిలింగ్ క్లబ్ నుంచి చిల్డ్రన్స్ పార్క్ వరకు, బుద్ధ భవన్ వెనుక ప్రాంతంలో, ఎన్టిఆర్ గ్రౌండ్స్ లో వాహనాల పార్కింగ్ వసతి కల్పిస్తున్నామని చెప్పారు. ఆంక్షలను గుర్తించి ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News