Friday, November 22, 2024
HomeతెలంగాణHyd: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పాపం బండి సంజయ్ దే

Hyd: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పాపం బండి సంజయ్ దే

బండి సంజయ్ వ్యాఖ్యలపై చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ ఒక రాజకీయ అజ్ఞాని అని, యువతను రెచ్చగొట్టడమే బండి సంజయ్ పని అని టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం వెనుక బండి సంజయ్ పాత్ర ఉందని టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులంతా బండి సంజయ్ అనుచరులేనని టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులంతా బిజెపి క్రియాశీలక కార్యకర్తలని రవిశంకర్ అన్నారు.
ధరణి వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భయంతో బండి సంజయ్ ధరణి గురించి పిచ్చోడిలా మాట్లాడుతునాడని అన్నారు. యువతను చెడగొట్టేది బిజెపి నాయకులని, యువత జీవితాలతో బండి సంజయ్ చెలగాటం ఆడుతున్నా డని ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వ వ్యవస్థల పనితీరు గురించి కనీస అవగాహన లేని వ్యక్తి బండి సంజయ్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News