ఉక్రెయిన్ యుద్ధంతో నష్టపోయిన భారతీయ వైద్యవిద్యార్థులను ఆదుకుంది ఉజ్బెకిస్థాన్. ఉజ్బెకిస్థాన్ రాయబార కార్యాలయంలోని ఫస్ట్ సెక్రటరీ మొహమ్మద్ మాట్లాడుతూ, ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారతదేశంలో విద్యార్థుల కెరీర్ భద్రత కోసం ఎన్ఎంసి నిబంధనలను అంగీకరించిందని, విద్యార్థులకు ఎంబసీ అన్ని విధాలుగా సహాయపడుతుందని చెప్పారు. ఉజ్బెకిస్థాన్ కు భారత్ స్నేహపూర్వక దేశమని, దౌత్యపరమైన సంబంధాలు, సహకారం విషయంలో 30వ వార్షికోత్సవం చేసుకుందని అన్నారు. రాయబారి దిల్షాద్ నేతృత్వంలో రాయబార కార్యాలయం విద్యార్థులకు అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆయన చెప్పారు.
ఈ క్లిష్ట సమయంలో తమ పిల్లల చదువుకు సహాయపడుతున్నందుకు తల్లిదండ్రులు… హెచ్.ఇ.అలిషర్ కయుమోవిచ్ షడ్మనోవ్, డాక్టర్ బి.దివ్య రాజ్ రెడ్డిలకు పెద్ద, కస్టమ్ కాన్వాస్ పెయింటింగ్ ఫ్రేమ్ బహూకరించారు.
ఉజ్బెకిస్థాన్ అంతర్జాతీయ వైద్యకేంద్రంగా ఎదుగుతోంది. ముంబైలోని అంబానీ ఆస్పత్రి, హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి అక్కడి మరాఫోన్ గ్రూప్ తో చేతులు కలిపి రూ.245 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశాయి. మెడికల్ టూరిజం, నిపుణులైన వైద్యుల పరస్పర మార్పిడి, హైరిస్క్ సర్జరీలు చేయడంలో భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.