Friday, November 22, 2024
HomeతెలంగాణHyd: ఘనంగా విద్యాదినోత్సవం

Hyd: ఘనంగా విద్యాదినోత్సవం

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన విద్యాదినోత్సవం కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేండ్లు అయినా కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. మన రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, కేంద్రీయ విద్యాలయం, నవోదయ స్కూలును మంజూరు చేయకుండా వివక్ష చూపిస్తోందని విమర్శించారు. కేంద్రం కొర్రీలు పెడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో వెనకడుగు వేయకుండా అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నామని కొనియాడారు.

- Advertisement -

తన చిన్ననాటి తీపి గుర్తులను నెమరువేసుకున్న శాసనమండలి చైర్మెన్..బడుల్లో ఓ పీరియడ్ స్టోర్ట్స్ కోసం కేటాయించాలని, పీఈటీలను అపాయింట్మెంట్ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సభాముఖంగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం అద్భుతంగా ఉందని..ఇంకా మెరుగ్గా విద్యను అందించాలన్నారు. విద్యాశాఖకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందరర్ రెడ్డి అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News