ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే బ్రాహ్మణులకు గుర్తింపు లభించిందని అర్చక సంఘాల సమాఖ్య పేర్కొంది. అందుకు ఎప్పుడూ తాము కేసీఆర్ బాటలోనే పయనిస్తామని వారు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులకు దీప దూపా నైవేద్యం కింద ఇచ్చే గౌరవ వేతనాన్ని 6,000 నుండి 10,000 లకు, వేద పండితులకు ఇస్తున్న గౌరవ భృతి 2,500 నుండి 5,000 లకు పెంచడం పట్ల వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మెరకు అర్చక సంఘం ప్రతినిధులు సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కాలం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉన్న తాము భవిష్యత్ లోను ఆయన బాటలోనే పయనిస్తామన్నారు. గౌరవ వేతనాన్ని పెంచినందుకు కృతజ్ఞతగా అర్చక సంఘము ప్రతినిధులు మంత్రి జగదీష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
మంత్రి జగదీష్ రెడ్డిని కలసిన వారిలో రామలింగయ్య శర్మ, వాసుదేవ శర్మ, అన్నంబోట్ల ఫణికుమార్ శర్మ, మంత్రమూర్తి ప్రసాద్ శర్మ, రాజేందర్ శాస్త్రి, అన్నంబొట్ల ప్రణయ్ శర్మ, గోవింద్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.