రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రపంచ వారసత్వ దినోత్సవం (ఏప్రిల్ – 18) ను పురస్కరించుకొని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు (జూలై – 25, 2021) పొందిన ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – పర్యాటక, ఆర్కియాలజీ శాఖల సహకారంతో ములుగు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో “శిల్పం, వర్ణం, కృష్ణం” – సెల్ బరేటింగ్ ది హెరిటేజ్ రామప్ప పేరుతో వరల్డ్ హెరిటేజ్ డే మెగా వేడుకలను ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం పురస్కరించుకొని రామప్ప దేవాలయం లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, ప్రముఖ డ్రమ్స్ వాయిద్య కారుడు శివమణి, సింగర్ కార్తీక్, ప్లూటిస్ట్ నవీన్ తో పాటు 300 మంది కళాకారులతో నిర్వహించనున్న వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాష్ట్ర హెరిటేజ్ తెలంగాణ అధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు ములుగు జిల్లా రెవిన్యూ డివిజనల్ అధికారి రమాదేవి, చారిత్రక పరిశోధకులు ఈమని శివనాగి రెడ్డి, వివిధ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు వాసవి గ్రూప్ రింకి, Q city మాలతీ, రజత్, flutta గ్రూప్ రాహుల్ కానుగంటి, గురు production రవి దులిపాల్ల తదితరులు పాల్గొన్నారు.