Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: జాతీయ గీతంతో ప్రపంచ రికార్డు

Hyd: జాతీయ గీతంతో ప్రపంచ రికార్డు

జాతీయ గీతాన్ని 7 గంటల పాటు 75సార్లు ఆలపించి ప్రపంచ రికార్డు సృష్టించింది మన తెలుగమ్మాయి. కరీంనగరుకు చెందిన డాక్టర్ పండుగ అర్చన ఈ ప్రపంచ రికార్డును సాధించారు. ఆమె సాధించిన విజయాలను గుర్తించిన జాతీయ పత్రిక తారే జమీన్ పర్ సంపాదకులు ఫిబ్రవరి ప్రత్యేక సంచికను రూపొందించారు. సంబంధిత సంచికను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఆవిష్కరించారు.

- Advertisement -

అనంతరం అర్చనను శాలువతో సత్కరించి అభినందించారు. జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్చన జాతీయ గీతాన్ని ఆలపించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకోని దేశం గర్వించేలా చేసిందని మంత్రి కొనియాడారు. జాతీయతా భావాన్ని పెంపొందించడంతోపాటు, భారత జాతీయ గీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేసి అర్చన రికార్డు సాధించిందని అన్నారు. మొట్టమొదటిసారిగా జాతీయ గీతాన్ని గౌరవిస్తూ.. జనగణమన మహత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రయత్నం చేసిన అర్చన నేటి యువతకు ఆదర్శమని మంత్రి వెల్లడించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సి. సజీవ నంబూద్రి స్వామి, బిఆర్ఎస్ నాయకుడు రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News