సమకాలిన ప్రపంచాన్ని యువత అర్థం చేసుకోవాలని, రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక, ఇతర సామాజిక అంశాలపై యువత అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర తృతీయ మహాసభలో పాల్గొన్న వినోద్ కుమార్ ..దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందన్నారు.